తెలంగాణ ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. కొన్నాళ్లుగా జానపద పాటలకు వచ్చే రెస్పాన్స్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సినిమాల్లో వచ్చే రొమాంటిక్ లవ్ సాంగ్స్ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు యూట్యూబ్ లో వైరలవుతున్న లవ్ సాంగ్స్, ఫెయిల్యూర్ సాంగ్స్ గురించి తెలిసిందే. ఇప్పుడు కుర్రాళ్లు తెగ పాడుకుంటున్న ఒక పాట గురించి తెలుసుకుందామా.
ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఏ స్థాయిలో దూసుకుపోతున్నాయో చెప్పక్కర్లేదు. కొన్ని పదాలు అర్థం కాకపోయిన పల్లె పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మట్టి వాసనను మనసుకు తాకే పాటలతోపాటు.. ప్రియురాలి కోసం ప్రేమికుడు పాడుకునే పాటలు కూడా దూసుకుపోతున్నాయి. నిజానికి ఫోక్ సాంగ్స్ లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తెగ వైరలవుతుంటాయి. కానీ ఇప్పుడు తమ ప్రేమను తెలియజేసేందుకు కుర్రాళ్లు సైతం ఈ ఫోక్ పాటలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఓ పాట యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్ స్టా రీల్స్ లో ట్రెండ్ అవుతుంది. వాలెంటైన్ వీక్ సందర్భంగా ఈ పాట మరోసారి ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బిగ్ బాస్ ఫేమ్ రామ్ రాథోడ్ అద్భుతంగా పాడిన ఈ పాట ఇప్పుడు శ్రోతల హృదయాలను గెలుచుకుంటుంది.
“సిరులైన సరిపోతాయా నీ చిరునవ్వులకు.. కల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే.. నాలోనే దాగుందమ్మా ఆ రూపం నీదే.. ఏ భాధ రానినమ్మో నీ ఆ కన్నులకే..” అంటూ రాము రాథోడ్ పాడిన పాట ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటుంది. దాదాపు 8 నెలల క్రితం విడుదలైన ఈ సాంగ్ ఇప్పటివరకు యూట్యూబ్లో 5.9 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఈ పాటకు శ్రావణ్ సాహిత్యం అందించగా.. రాము రాథోడ్, శ్రీనిధి అందంగా ఆలపించారు. దీలిప్ దేవగన్ దర్శకత్వం వహించిన ఈ పల్లె పాటలో రాము రాథోడ్, మాంకృతి, చోట పటాక నటించారు. యశోద ప్రొడక్షన్స్ ఈ పాటను నిర్మించారు. ఇన్నాళ్లుగా యూట్యూ్బ్ లో దూసుకుపోతున్న ఈ పాట.. ఇప్పుడు వాలెంటైన్ వీక్ సందర్భంగా మరోసారి ట్రెండింగ్ అవుతుంది. ముఖ్యంగా తమ ప్రేమను తెలియజేస్తూ ప్రియురాలికి ఈ పాటను తెలియేజేసే కుర్రాళ్లు తెగ పాడేస్తున్నారు.

