బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.. ఎండ తీవ్రత పెరిగింది.. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ.. 35 డిగ్రీలకు చేరుకున్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.. ఎండ తీవ్రత పెరిగింది.. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ.. 35 డిగ్రీలకు చేరుకున్నాయి.. ఎండాకాలం పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 35 డిగ్రీల సెల్సియస్‌ను నివేదిస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.

ఏపీ వెదర్ రిపోర్ట్..
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక :- రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఆగ్నేయ దిశల నుండి వీచుచున్నవి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు.. మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు