మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

మెగా అభిమానుల మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మన శంకరవరప్రసాద్ గారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం.. విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషించడం మరో హైలెట్. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీగానే అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. క్యాథరిన్ సైతం కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. అటు తనదైన స్టైల్లో ఈ సినిమా ప్రమోషన్ వీడియోస్ షేర్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఈ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అప్డేట్ అందించారు మేకర్స్.

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదగురుచూస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. జనవరి 4న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఆ పోస్టర్ లో చిరంజీవి పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో గన్ పట్టుకుని ఫైట్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఈ పోస్టర్ తెలియజేస్తుంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో మెగాస్టార్ లుక్స్ అదిరిపోయాయని.. బ్లాక్ బస్టర్ కళ ఉట్టిపడుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. వారం రోజుల ముందుగానే ట్రైలర్ తో సందడి స్టార్ట్ చేయనున్నారు. అలాగే చాలా కాలం తర్వాత పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా