బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా..? ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..!

బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా..? ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..!

బిర్యానీ ఆకు మంచి మసాలా మాత్రమే కాదు.. వాటిలో మంచి ఔషధ గుణాలు సైతం ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుతో వంటకు రుచి పెరగడమే కాకుండా.. ఇవి ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు. బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి.

బిర్యానీ ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తోంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే ఎంజైమ్‌లను పెంచుతుంది. దీంతో అజీర్తి, మలబద్దకం దరి చేరవు. మూత్ర సంబంధ సమస్యలు, కిడ్నీలో రాళ్లను దూరం చేస్తాయి. బిర్యానీ ఆకుల్లో ఫైటో కెమికల్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి షుగర్‌ను నియంత్రిస్తాయి. వీటిని తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

బిర్యానీ ఆకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎముకల్లో నొప్పి, వాపును తగ్గిస్తాయి. బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

బిర్యాని ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, చర్మం ఎరుపెక్కడం వంటి సమస్యలను తొలగిస్తాయి. బిర్యాని ఆకులు తీసుకుంటే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైటోకెమికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. దీంతో పాటు లివర్, కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.

బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు గుండె సమస్యలను దూరం చేస్తాయి. బిర్యాని ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి.

బిర్యానీ ఆకులను తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయిటకుపోవచ్చు. బిర్యాని ఆకులు తింటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. బిర్యానీ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని పోగొట్టి జుట్టు ఎదుగుదలకి తోడ్పడతాయి. వీటిలో విటమిన్ ఏ,సితోపాటు ఐరన్, మెగ్నీషియం వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు