ఒక సంప్రదాయం, లేదా ఒక సంస్కృతి లేదా ఒక అలవాటు అనేది కొన్నేళ్ల పాటు ఉంటుంది. పోనీ వందల సంవత్సరాలు ఉంటుంది. కనీసంలో కనీసం మార్పు చెందుతుంది. కానీ, వేల ఏళ్లుగా ఒక సంప్రదాయంగా, ఒక సంస్కృతిగా, ఒక అలవాటుగా ఏ మార్పూ లేకుండా వస్తున్నది అది యోగానే. పైగా మనది ఆధ్యాత్మిక భారతం. శరీరం, మనసు, ఆత్మ చుట్టూ తిరిగే ఓ ఆధ్యాత్మిక ప్రపంచం.
ఒక సంప్రదాయం, లేదా ఒక సంస్కృతి లేదా ఒక అలవాటు అనేది కొన్నేళ్ల పాటు ఉంటుంది. పోనీ వందల సంవత్సరాలు ఉంటుంది. కనీసంలో కనీసం మార్పు చెందుతుంది. కానీ, వేల ఏళ్లుగా ఒక సంప్రదాయంగా, ఒక సంస్కృతిగా, ఒక అలవాటుగా ఏ మార్పూ లేకుండా వస్తున్నది అది యోగానే. పైగా మనది ఆధ్యాత్మిక భారతం. శరీరం, మనసు, ఆత్మ చుట్టూ తిరిగే ఓ ఆధ్యాత్మిక ప్రపంచం. ఆ సాధనలో మనిషిని మరో మెట్టు ఎక్కించేది యోగా మాత్రమే. అందుకే, వేల ఏళ్లైనా ఇప్పటికీ మనుగడలో ఉంది, ప్రపంచం సైతం గుర్తించింది. ఇంతకీ.. యోగాను యూత్ ఎలా అడాప్ట్ చేసుకుంటోంది. పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ సాధనలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. డైలీ లైఫ్ స్టైల్‌ను మరింత మెరుగుపరుచుకోవాలంటే ఇవొక్కటే మార్గం. అతిశయోక్తిగా అనిపించినా సరే.. ఇందులో లేనిదంటూ లేదు. శారీర దారుఢ్యం, మానసిక వికాసం, రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికి ఎలాంటి వ్యాయామం కావాలో అలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయి. ఇంతటి డీప్ సబ్జెక్ట్.. వైద్య శాస్త్రంలో కూడా లేదంటారు యోగా గురువులు. ఎందుకంటే.. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెబుతున్న ఒక లెక్క. సృష్టిలోని ప్రతి జీవిని పరిశీలించి, మనిషికి కావాల్సిన ఆసనాలను తయారు చేశారని చెబుతారు. సాధారణంగా యోగాలో 84వేల ఆసనాలు ఉన్నాయంటుంటారు. వాటిని రుషులు కాస్త సింప్లిఫై చేసి, ఓ…