కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి
గత బీఆర్‌ఎస్ సర్కార్ వందల కోట్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి.. యాదాద్రిగా మార్చేసింది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చివెళ్తున్నారు. పాంచ నారసింహుడు వెలసిన యాదగిరిగుట్ట స్వయంభూ…