మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ యూజీ 2025 పరీక్ష..

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ప్రవేశ పరీక్ష మరో వారం రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింది.

పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం వంటి తదితర సమాచారం ఉంటుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేయనున్నారు. ఇక నీట్ యూజీ 2025 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

కాగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. నీట్‌ యూజీ 2025 పరీక్ష తొలుత ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్టీయే భావించినప్పటికీ ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని భావించింది. దీంతో పెన్ను, పేపర్‌ విధానంలో మే 4వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. గతేడాది ఏకంగా 24 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. మొత్తం 180 నిమిషాలు అంటే 3 గంటల పాటు నీట్ రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష సిలబస్‌, పరీక్ష విధానం, పరీక్ష కేంద్రం తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు