శక్తిపీఠం, జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దర్శించుకున్నారు. నూతన దంపతులు నాగచైతన్య, శోభితలను వెంటపెట్టుకుని.. మల్లికార్జున స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నాగార్జున కుంటుంబం ఆలయంలోకి రాగానే వేద పండితులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామి అమ్మవార్లకు నూతన దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
Please follow and like us: