బల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ఆ వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మారుతి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ ల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్ ఓ సినిమా చేస్తున్నాడు.
వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలోనూ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ లుక్ ను కూడా కన్నప్ప టీమ్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కన్నప్ప’ సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేశాను అని మంచు విష్ణు అన్నారు. మరో క్షణం ఆలోచించకుండా ప్రభాస్ ఓకే చెప్పాడని మంచు విష్ణు తెలిపారు. ముందుగా నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని తెలిపాడు మంచు విష్ణు. ఆ విషయాన్ని ప్రభాస్ తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఏదైనా పనుంటే నువ్వే కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ ఇలా చాలా మంది నటిస్తున్నారు. మార్చ్ 1న కన్నప్ప టీజర్ విడుదలకానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది.