పట్టాలెక్కిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా.. మొదటి రోజే 3 వేలమందితో షూటింగ్.. ఫొటోస్ వైరల్

పట్టాలెక్కిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా.. మొదటి రోజే 3 వేలమందితో షూటింగ్.. ఫొటోస్ వైరల్

దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు ఎన్ టీఆర్ 31 కూడా పట్టాలెక్కింది.

‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. . చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ గురువారం (ఫిబ్రవరి 20) ప్రారంభమైంది. ముందే చెప్పినట్లుగా, ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో మొదటి రోజే 3,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు! ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా ఉత్సాహంతో సినిమా షూట్ ను ప్రారంభించారు. ఇది ఒక గొప్ప యాక్షన్ సినిమా అవుతుందన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో వైరల్‌గా మారింది. పుష్ప 2 తో మరోసారి దేశ వ్యాప్తంగా పాపులరైన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠత్మకంగా నిర్మిస్తోంది. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాభారతీయ సినిమా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేస్తుందని నిర్మాతలు తెలిపారు.కాగా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ ఇందులో పాల్గొనలేదు. మొదటి షెడ్యూల్ షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. తరువాత, రెండవ దశలో ఎక్కువసేపు షూట్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో పాల్గొంటారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది తారక్ కు మొదటి బాలీవుడ్ సినిమా.ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నాడు తారక్.ఇక ఎన్టఆర్ ‘దేవర 2’ కూడా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది. ప్రశాంత్ నీల్ తో సినిమా పనులు పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ సెట్ అవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీ బిజీగా ఉంటున్నాడు.

Please follow and like us:
వార్తలు సినిమా