ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , సాంగ్స్ సినిమా పై హైప్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు సినిమా లవర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , సాంగ్స్ సినిమా పై హైప్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగాపాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. యష్ హీరోగానటించిన కేజీఎఫ్, కేజీఎఫ్2 రెండు సినిమాలు భారీహిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే దాదాపు ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. మూవీ మేకర్స్ ఆగస్ట్ 9 వరకు ప్రకటించకూడదని అనుకుంటున్నారట. పూజా కార్యక్రమం రోజునే టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నట్లున్నారట. ఈ సినిమాతో అభిమానులకు అదిరిపోయే కిక్ ఇవ్వనున్నారు. అలాగే ఎన్టీఆర్ హిందీలోనూ సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.