మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లే..

మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లే..

చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే, జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. మీరు ముఖంపై అలాంటి గుర్తులు కనిపిస్తే, ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ప్రమాదమేనన్న విషయం వైద్యులు పదేపదే చెబుతుంటారు. కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలంటే లిపిడ్ పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే, జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. మీరు ముఖంపై అలాంటి గుర్తులు కనిపిస్తే, ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి.

చర్మం పసుపు:

ముఖంపై పసుపు రంగు కనిపిస్తే అది రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని కారణంగా చర్మంపై పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది.

ముఖం మీద గడ్డలు కనిపిస్తున్నాయి:

కొన్నిసార్లు ముఖంపై చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి. నొప్పి లేకుండా జరిగేది. అలాంటి చిన్నపాటి గడ్డలను విస్మరిస్తుంటారు. కానీ సాధారణంగా కళ్ల చుట్టూ ఏర్పడే ఈ గడ్డలు అధిక చెడు కొలెస్ట్రాల్ అని అర్థం.

కళ్ళు చుట్టూ పసుపు మచ్చలు:

చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, కళ్ల చుట్టూ లేత పసుపు రంగు దద్దుర్లు, కొన్ని చిన్న పసుపు మొటిమలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే చెడు కొలెస్ట్రాల్‌ పెరగడానికి సంకేతాలుగా గుర్తించండి.

ముఖం మీద వాపు:

ముఖం మీద వాపు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఈ వాపు వస్తుంది. దీని వల్ల ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. లేదా చర్మం పూర్తిగా పొడిబారుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు