పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అందుకే అందరి చూపు వీటి ధరలపై ఉంటుంది.. అయితే.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి..
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు .. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల గోల్డ్ ధర 80వేల నుంచి 77 వేలకు చేరువైంది.. తాజాగా, గోల్డ్, సిల్వర్ ధర స్వల్పంగా పెరిగింది.. గురువారం (21 నవంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,160, 24 క్యారెట్ల బంగారం రూ.77,630 గా ఉంది.. వెండి కిలో ధర రూ.92,100 గా ఉంది. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది..
దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,160, 24 క్యారెట్ల ధర రూ.77,630 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,160, 24 క్యారెట్ల ధర రూ.77,630 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,310, 24 క్యారెట్ల ధర రూ.77,780 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.71,160, 24 క్యారెట్ల ధర రూ.77,630 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.71,160, 24 క్యారెట్లు రూ.77,630
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.71,160, 24 క్యారెట్ల ధర రూ.77,630 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.100,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.100,900లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.92,100, ముంబైలో రూ.92,100, బెంగళూరులో రూ.92,100, చెన్నైలో రూ.100,900 లుగా ఉంది.