సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్…తొలిసారి ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేట్ చైన్‌లింగ్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే.. నీటి వృధాను తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ రైతులకు మాత్రం కంటిమీద కునుకులేదు.
దేశంలోనే అతి పెద్ద రాతి కట్టడం, రెండు నాన్ సిమెంట్ డ్యామ్‌ల్లో ఒకటి.. కర్ణాటకలోని హోసపేట, కొప్పల్ సంగమం వద్ద తుంగభద్ర నదిపై నిర్మించిన నీటి రిజర్వాయర్. ఈ తుంగభద్ర డ్యాంని పంపా సాగర్ అని కూడా పిలుస్తారు. నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ మొదలైనవాటిని అందించే బహుళార్ధసాధక ఆనకట్ట తుంగభద్ర డ్యామ్ 69 ఏళ్ల చరిత్రలో… ఫస్ట్ టైమ్ ప్రమాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ప్రమాదానికి కారణాలేంటి.. ? డ్యామ్ భద్రతను తుంగలో తొక్కేశారా.. ? అధికారులు చెబుతున్నట్లు 3 రోజుల్లో స్టాప్‌లాక్ సాధ్యమేనా.. అప్పటివరకు నీటి వృదాను తగ్గించేందుకు అధికారులు ఏం చేస్తున్నారు.. ? వంటి అనేక ప్రశ్నల నేపధ్యంలో ఈ రోజు తుంగభద్ర ఆనకట్టబి NDSA టీమ్ ఈ రోజు పరిశీలించనునుంది.
సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్…తొలిసారి ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేట్ చైన్‌లింగ్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే.. నీటి వృధాను తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ రైతులకు మాత్రం కంటిమీద కునుకులేదు. అనంతరం, కర్నూలు జిల్లాలకు గుండెకాయలాంటి ఈ డ్యామ్‌ను నమ్ముకుని.. రైతులు లక్షలాది ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఈ ప్రమాదంతో సాగుకు నీళ్లు అందుతాయో లేదోనన్న ఆందోళనకు గురవుతున్నారు.
డ్యామ్ మరమ్మతులు ఇప్పటికే మొదలయ్యాయంటూ కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పారు తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన… నీటి వృధాను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అంతేకాదు స్టాప్‌లాక్ ఎలిమెంట్స్‌కి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 3 రోజుల్లో స్టాప్‌లాక్ ఏర్పాటు చేసి… పరిస్థితిని అదుపులోకి తెస్తామని స్పష్టం చేశారు రామకృష్ణారెడ్డి.
ఇవాళ నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ టీమ్ కూడా తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించనుంది. ప్రమాదం ఎలా జరిగింది…? ఏం చేస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది..? అన్న దానిపై అధికారులకు పలు సూచనలు ఇవ్వనున్నారు. ఏం చేస్తే ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉంటుందన్న దానిపై కూడా డ్యామ్ బోర్డు సభ్యులతో NDSA టీమ్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా… డ్యామ్ కొట్టుకుపోవడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తుంగభద్ర నుంచి ఏపీ, తెలంగాణ వాటా నీటి జలాలను విడుదల చేస్తామని… కాకపోతే రబీ సీజన్లో నీళ్లు ఇవ్వలేకపోవచ్చంటున్నారు. మరి చూడాలి… పరిస్థితి ఎన్ని రోజులకు అదుపులోకొస్తుందో…!