దర్శకుడు అనిల్ రావు పూడి 2025 సంక్రాంతికి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు మన శంకర వరప్రసాద్ మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు. జనవరి 12 థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగా సందర్బంగా జనవరి 12న గ్రాండ్ గా విడుదలైంది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో అదిరిపోయే లుక్ లో అదరగొట్టారు. అలాగే మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. చిన్న పెద్ద అందరూ ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా మొదటి రోజే అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 84కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్, మొదటి రోజు కలెక్షన్స్ కలుపుకొని మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 84 కోట్లు వసూల్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఆసక్తికర పోస్టర్ ను విడుదల చేశారు. దాంతో అభిమానులు అందంలో తేలిపోతున్నారు. మెగాస్టార్ ను చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ లో చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
మెగాస్టార్ పెర్ఫామెన్స్, డ్యాన్సులు, దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్, వెంకీ క్యామియో రోల్, నయనతార స్క్రీన్ ప్రజెన్స్, పాటలు.. ఇలా ఈ సినిమాలో పాజిటివ్ అంశాలు చాలానే ఉన్నాయి. దాంతో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే ఈ సినిమాలో క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, రఘుబాబు, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటించారు.

