సైఫ్ అలీఖాన్‏కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..

సైఫ్ అలీఖాన్‏కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ను ఇప్పటికే పలువురు సినీప్రముఖులు పరామర్శించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన బాలీవుడ్ సినీప్రముఖులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ అతడి పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శస్త్ర చికిత్స చేసి సైఫ్ వెన్నుముక నుంచి రెండు అంచుల కత్తిని తొలగించారు వైద్యులు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో సైఫ్ పై జరిగిన దాడి ఘటన గురించి ఆమె ప్రవర్తిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సైఫ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఊర్వశి ప్రవర్తించిన తీరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశీని సైఫ్ దాడి గురించి ప్రశ్నించగా.. ఆయన త్వరగా కోలుకోవాలనున్నారు. అయితే ఆ సమయంలో ఊర్వశీ తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం దాని గురించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై ఆమె సైఫ్ కు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. “సైఫ్ సర్.. మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ విషయంలో మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మాహారాజ్ విజయోత్సాహంలో ఉన్నాను. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతులు గురించి మాట్లాడాను. ఈ విషయంలో సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ పై గౌరవం పెరిగింది” అంటూ రాసుకొచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశీ డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో తనకు ఎంతో మంది బహుమతులు పంపించారని.. అలాగే తన చేతివేలికి ఉన్న వజ్రపు ఉంగరాన్ని చూపించింది. అయితే తన బహుమతులకు, దాడికి ముడిపెట్టి మాట్లాడటంతో ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి.

Please follow and like us:
వార్తలు సినిమా