అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ఏజెంట్ సినిమా బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు అఖిల్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత హలో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆతర్వాత మిస్టర్ మజ్ను అనే సినిమాతో వచ్చాడు.
ఈ సినిమా కూడా నిరాశపరిచింది. వరుసగా ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. బొమ్మరిల్లు బాస్కర్ తో సినిమా చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఆ హిట్ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. చివరిగా ఏజెంట్ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు. దాంతో ఈ సినిమా పై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతుంది. ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ సినిమాలోటీటీలోకి రాలేదు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా ఓటీటీ రాలేదు. ఇక ఇప్పుడు ఏజెంట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రావడం లేదు.. కానీ టీవీలో ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగులో కాదు.. హిందీలో.. ఏజెంట్ సినిమా హిందీ వెర్షన్ త్వరలో గోల్డ్ మైన్ టీవీ ఛానెల్లో ప్రీమియర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియాలు కీలక పాత్రల్లో నటించారు. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.