కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా వరలక్ష్మి మృతదేహం లభ్యమైంది. గోవర్ధన్ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Please follow and like us: