పండగవేళ పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలోనే బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటికే ఆల్‌టైం హైకి చేరి రూ.1.40లక్షల మార్క్‌ను క్రాస్ చేసిన బంగారం తాజాగా పెరిగిన ధరల తర్వాత ఎలా ఉందో చూద్దాం పదండి.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలోనే 24 క్యారెట్ల తులం బంగారం దర రూ.300లకు పైగా పెరిగింది. దీంతో ఉదయం 6గంటలకు రూ.1,42,160 ఉన్న తులం బంగారం ధర ప్రస్తుతం రూ. 1,42,530కి చేంది.
ఇక బంగారంమే కాదు అటు వెండి కూడా పండగ వేళ సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. మంగళవారం ఉదయం నుంచి 10 గంటల మధ్య ఏకంగా కేజీ వెండి ధర రూ.5000 వరకు పెరిగింది. దీంతో ఉదయం ఆరు గంటలకు రూ. 2,87,100గా ఉన్న వెండి ధర ప్రస్తుతం రూ.2,92,000కు చేరుకుంది.
ఇక మంగళవారం ఉదయం మార్కెట్ హెచ్చుతగ్గుల తర్వాత తెలుగు రాష్ట్రాలతో బంగారం వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,530 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,650 వద్ద ట్రేడవుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,42,530 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,650 వద్ద స్థిరపడింది.
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళలో తులంగా బంగారం ధర రూ.ధర రూ.1,42,530 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,650 వద్ద స్థిరపడింది. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43, 680 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,42,680 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,30,800 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూసుకుంటే హైదరాబాద్ కేజీ వెండి దర రూ.2,92,000గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలోనూ కేజీ వెండి రూ.2,92,000గా ఉంది. ఇక బెంగళూరు, కోల్‌కతా, పూణెలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

