ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?

ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?

పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే అందరికీ వెన్నులో అదురు పడుతుంది. బంధువుల పిల్లలు, తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ పరీక్షలు రాస్తుంటే ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే కొందరు విద్యార్ధులు బాగా చదివి 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకుంటే.. మరికొందరేమో పిండికొద్దీ రొట్టే అన్నట్లు ఎవరి స్థాయికి తగ్గ మార్కులు వారు తెచ్చుకుంటూ ఉంటారు. వీరందరి సంగతి పక్కన పెడితే ఓ విద్యార్థి మాత్రం ఏడాదంతా బడికి పోయి 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు తెచ్చుకున్నాడు. అదేంటీ.. ? అని అనుకుంటున్నారా.. మీరు సరిగ్గానే విన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెల పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి రెండు రాష్ట్రాల్లోనూ ఫలితాలు డిఫరెంట్‌గా వచ్చాయి. అత్యధికంగా పాస్‌ పర్సెంటైల్‌ నమోదైంది. కొందరు విద్యార్ధులు 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకున్నారు. 600లకు ఒకేఒక్క మార్కు తక్కువ వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇక వీరందరి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ విద్యార్థికి మాత్రం 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. అదేంటీ.. ? అని అనుకుంటున్నారా.. మీరు సరిగ్గానే విన్నారు.

మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి మొత్తం 600 మార్కులకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తే.. ఓ విద్యార్ధికి ఒకేఒక్క మార్కు వచ్చిందండీ. ఏడాదంతా బడికి పోయినప్పటికీ సదరు విద్యార్ధి ఆరు సబ్జెక్టులూ ఫైయిలవడం గమనార్హం. పైగా వచ్చిన ఆ ఒక్కమార్కు కూడా సైన్స్ సబ్జెక్టులో వచ్చించి. సదరు విద్యార్ధికి మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. పేపర్‌పై ఒక్క అక్షరం ముక్కకూడా పెట్టినట్లులేదు. దీంతో ఇంత అరవీర భయంకరంగా పరీక్షలు రాయడం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల చరిత్రలోనే రికార్డు సాధించినట్లైంది. సదరు విద్యార్ధి మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏ జిల్లాలో జరిగిందో తెలియదు గానీ ఈ మార్కుల జాబితా మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే టెన్త్‌లో ఈ ఒక్క మార్కు తెచ్చుకున్న విద్యార్ధి ఏ కారణంగా.. పరిస్థితులు ఏమై ఉంటం వల్ల.. ఇలా పరీక్షలు రాయవల్సి వచ్చిందో మనం ఊహించలేం. ఏదీఏమైనా ఒక్క పరీక్షలు మాత్రమే మన జీవితంలోని గెలుపోటములను నిర్ణయించలేవన్నది అక్షర సత్యం.

పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఏపీలో మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులు మే 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉంది. అంటే పరీక్షకు ఒక్కరోజు ముందు వరకు ఫీజు కట్టొచ్చన్నమాట. పదో తరగతిలో ఫెయిలైన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులు కూడా ఫీజు కట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చు. ఇతర వివరాలు విద్యార్ధులు తాము చదువుతున్న స్కూళ్లకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవచ్చు. ఫీజు కట్టి పరీక్షలకు బాగా ప్రిపేరై ఈసారి చక్కగారాశారంటే అన్ని సబ్జెక్టులు పాస్‌ అవడం గ్యారెంటీ..!

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు