లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్..
లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఈ రోజు విజయవాడ జిల్లా జైలు, గుంటూరు జిల్లా జైలులో ఉన్న నిందితులను కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కాం కేసులో 12 మందిని అరెస్టు చేయగా.. వారిలో నలుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. మొత్తం ఐదుగురికి బెయిల్ మంజూరైంది. మరోవైపు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఏడుగురు నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డి సరెండర్ కానున్నాడు.