డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌తో 24.5 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. జనవరి 6 కాపిటల్ దాడి తర్వాత హింసను ప్రేరేపించవచ్చని యూట్యూబ్ ఆయన ఛానెల్‌ను నిషేధించింది. 2023లో బ్యాన్ ఎత్తేసినా, ట్రంప్ పరిహారం డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సెటిల్‌మెంట్‌లో అధిక భాగం వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్ నిర్మాణానికి కేటాయించారు.
డొనాల్డ్ ట్రంప్ ఛానెల్ నిషేధించిన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, యూట్యూబ్ 24.5 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ట్రంప్‌తో కుదుర్చుకుంది. జనవరి 6న జరిగిన కాపిటల్ దాడి తర్వాత యూట్యూబ్ ట్రంప్ ఛానల్‌పై బ్యాన్ విధించింది. ట్రంప్ కంటెంట్ మరింత హింసను ప్రేరేపించగలదని పేర్కొంటూ కంపెనీ మొదట ట్రంప్ ఛానెల్‌ను మూసివేసింది. 2023లో యూట్యూబ్ ట్రంప్ ఛానల్‌పై బ్యాన్ ఎత్తేసినప్పటికీ, ట్రంప్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
యూట్యూబ్ నుంచి వచ్చిన సెటిల్మెంట్ డబ్బు నుండి ఎక్కువ భాగం వైట్ హౌస్ బాల్రూమ్ కోసం కేటాయించారు. ఒప్పందం నిబంధనల ప్రకారం.. చెల్లింపులో 22 మిలియన్ డాలర్లు ట్రంప్ అభ్యర్థ మేరకు వైట్ హౌస్‌లో కొత్త బాల్‌రూమ్ నిర్మాణానికి కేటాయించారు. మిగిలిన 2.5 మిలియన్ డాలర్లు అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్, వారి ఖాతాలు కూడా ఇదే విధంగా ప్రభావితమైన తర్వాత YouTubeపై దావాలో చేరిన వ్యక్తుల బృందానికి ఇవ్వనున్నారు.
ట్రంప్ ఛానెల్‌ను యూట్యూబ్ ఎందుకు నిషేధించింది?
కాపిటల్ అల్లర్ల తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ వీడియోలు హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందని పేర్కొంటూ యూట్యూబ్ మొదట్లో ఆయన ఛానెల్‌ను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన తర్వాత ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సైతం ట్రంప్ అకౌంట్లను బ్లాక్ చేశాయి. అయితే ఇటీవలి సంవత్సరాలలో ప్లాట్‌ఫారమ్‌లు ట్రంప్ అకౌంట్లను రీ యాక్టివేట్ చేసినా కూడా ట్రంప్ చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు.
ట్రంప్ వరుస విజయాలు
2021లో ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేసిన తర్వాత ఎలోన్ మస్క్ ఎక్స్(గతంలో ట్విట్టర్) దాదాపు 10 మిలియన్ డాలర్లు చెల్లించగా, మెటా 25 మిలియన్ల డాలర్ల పరిష్కారానికి అంగీకరించింది. అదేవిధంగా ABC న్యూస్ ఇంటర్వ్యూకు సంబంధించిన పరువు నష్టం దావా తర్వాత డిస్నీ 15 మిలియన్ డాలర్లు చెల్లించింది.