భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ తరుణంతో ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. దేశ రక్షణలో తాము భాగం అవుతామంటున్నారు. చదువుతో పాటు ఆర్మీలో చేరేందుకు ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. దేశ సేవ చేయడానికి తాము సిద్దమని అంటున్నారు. ఇలా ప్రతియేటా యువత ఆర్మీలో చేరి తమ సత్తాను చాటుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్మీలో చేరేందుకు యువత ఉత్సహాంగా ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కఠోర సాధన కూడా చేస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ఉన్న డిఫెన్స్ అకాడమీల నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను వారు క్షుణ్నంగా గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంతో యుద్ధం వస్తే స్థానికంగా తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం మని చెబుతున్నారు.
ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ఉన్న డిఫెన్స్ అకాడమీలు శిక్షణ తీసుకుంటున్న యువత, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తామని అంటున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణమాల గురించి తెలుసుకుంటున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను పరిశీలిస్తున్నారు. భారత్ దాడి చేసిన విధానాన్ని చూసి.. మరింత ఉత్సహాంతో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఏమైనా అవకాశం ఇస్తే..ఆర్మీకి సహాయం చేసేందుకు చేయడానికి సిద్ధంగా ఉన్నామని యువత అంటున్నారు.
ఇలా ఆర్మీలో చేరే ఆసక్తి ఉన్న యువతను ఆర్మీకి పంపేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 10కిపైగా ఢిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి. ఈ అకాడమీల నుంచి ప్రతియేటా చాలా మంది యువత ఆర్మీకి సెలెక్ట్ అవుతున్నారు.” వీరిని స్పూర్తిగా తీసుకొని మరి కొంత మంది కూడా ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ప్రతి రోజు ఫిట్నెస్పై దృష్టి పెడుతున్నారు. అయితే గతంలో కేవలం అబ్బాయిలో మాత్రమే ఆర్మీ ట్రైనింగ్ తీసుకునే వారు..కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆర్మీ శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్మీలో చేరి దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే ప్రస్తుత భారత్-పాక్ ఉద్రిక్తతలను గమనిస్తున్న యువత.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెబుతున్నారు. తాము ఆర్మీలో చేరేందుకు.. శిక్షణ తీసుకుంటున్నామని.. తమకు కూడా యుద్ధానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.