ఈ రోజుల్లో కంటెంట్ లేని సినిమాలైనా వస్తున్నాయేమో గానీ గ్రాఫిక్స్ లేని సినిమాలు మాత్రం రావట్లేదు. ప్రతీ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రాణంగా మారిపోయింది. మైథలాజికల్ సినిమాలకు అయితే మరీనూ..! అయితే ఈ సినిమాల్లో విఎఫ్ఎక్స్ అంతగా సెట్ అవ్వట్లేదు. మరి అంత ఖర్చు చేస్తున్నా.. మైథాలజీ మూవీస్‌లోని గ్రాఫిక్స్ ట్రోలింగ్ బారిన పడటానికి కారణమేంటి..?
ఆదిపురుష్ విడుదలైనపుడు ఎలా ఉందనేది ఎవరూ మాట్లాడుకోలేదు.. అందులోని గ్రాఫిక్స్ గురించే అంతా చర్చించుకున్నారు. ఆదిపురుష్ గ్రాఫిక్స్‌ను ట్రోల్ చేసినంతగా.. మరే స్టార్ హీరో సినిమాను ఈ మధ్య కాలంలో ట్రోల్ చేయలేదు.
హనుమాన్ విడుదలైన తర్వాత ఆదిపురుష్‌ను మరోసారి దారుణంగా ట్రోల్ చేసారు.లిమిటెడ్ బడ్జెట్‌లో మైథాలజీ కాన్సెప్ట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వచ్చిన సినిమా హనుమాన్. ఈ సినిమా విఎఫ్ఎక్స్ చూసాక.. దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది.
అన్ని సినిమాలకు హనుమాన్ మాదిరి వర్కవుట్ అవ్వదు కదా..? తాజాగా హోంబలే ఫిల్మ్స్ నుంచి వస్తున్న మహావతార్ నరసింహా గ్రాఫిక్స్‌పై కూడా ట్రోలింగ్ మొదలైంది.
ఆదిపురుష్ తరహాలోనే వస్తున్న నరసింహా సినిమాలో ఇంకా బెటర్ గ్రాఫిక్స్ ఉంటే బాగున్ను అంటున్నారు ఆడియన్స్. అలాగే కన్నప్ప సినిమా VFXపై ట్రోలింగ్ బాగానే జరిగింది.
ముఖ్యంగా ప్రభాస్ ఉన్నంతసేపు విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేవనే టాక్ వచ్చింది. మొత్తానికి మైథలాజికల్ సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ బెటర్ గ్రాఫిక్స్‌పై ఫోకస్ పెట్టాల్సిందే.. లేదంటే ఫలితం దారుణంగా ఉంటుంది.