ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ సేల్ రాబోతోంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్‌తో మొబైల్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్, ఎలక్ట్రిక్ వస్తువులు ఇలా ఎన్నో రకాల వాటిని భారీ..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్ షాపింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అంతా పండగ సీజన్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ సేల్ రాబోతోంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్‌తో మొబైల్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్, ఎలక్ట్రిక్ వస్తువులు ఇలా ఎన్నో రకాల వాటిని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇక ఇప్పుడు అందరి చూపు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌పైనే ఉంది.
అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 30 నాటికి ముగుస్తుందని సమాచారం. ఈ తేదీలు ఫ్లిప్‌కార్ట్‌లోని అధికారిక ఉత్పత్తి పేజీలో కనిపిస్తాయి. ఈ పేజీ రూ.1 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ ప్రత్యేకంగా ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ సభ్యులకు ఒక రోజు ముందుగానే సేల్ ప్రారంభమవుతుంది.
ఇక అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (Great Indian Festival) 2025 సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశ పండుగల సీజన్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. భారీ తగ్గింపులు, ఆఫర్లు ఉంటాయి. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ఈ భారీ సేల్‌లపై అధికారంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సారి ఐఫోన్‌లతో పాటు మరిన్నిస్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. అలాగే స్మార్ట్ టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్‌లు కొనుగోలు చేసే వారికి బంపర్ డిస్కౌంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.