యువత ఎక్కువగా గుండె సమస్యల భాగిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం, ఆధునిక జీవనశైలి. నిజానికి దీర్ఘకానికి వ్యాధుల బారిన పాడేవారు ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువగా దానిమ్మ పండ్ల రసం తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆధునిక జీవనశైలి కారణంగా కొంతమంది తీవ్రదీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నేటి యువత ఎక్కువగా గుండె సమస్యల భాగిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం, ఆధునిక జీవనశైలి. నిజానికి దీర్ఘకానికి వ్యాధుల బారిన పాడేవారు ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువగా దానిమ్మ పండ్ల రసం తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దానిమ్మ పండ్ల రసంలో విటమిన్ సి తో పాటు విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఈ రసంలో విటమిన్ బి9 కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటుంది. గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ఒక గ్లాసు రసాన్ని తాగడం మంచిది. రక్తనాళాల్లో కొవ్వు కరిగించి రక్తపోటు అదుపులో ఉంచడంలో దానిమ్మ రసం సహాయపడుతుంది. హైబీపీ సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం మేలు.
దానిమ్మ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి. అలాగే ట్రైగ్లిజరాయిడ్స్ కూడా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు రోజుకు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది. ఇందులో ఉండే అద్భుతమైన గుణాలు అధిక రక్తపోటును నియంత్రించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. దానిమ్మలో పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
దానిమ్మ రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో సహాయపడుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడి జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. దానిమ్మ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఎల్లపుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. దానిమ్మ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపర్చి స్కిన్ గ్లో పెంచుతాయి. రోజుకు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే ఎల్లపుడూ యవ్వనంగా కనిపించొచ్చు.

