బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

బిగ్ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని.. అక్టోబర్‌ 2న వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. 3న ఉత్తర కోస్తా, దక్షిణఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది..

వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని.. అక్టోబర్‌ 2న వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. 3న ఉత్తర కోస్తా, దక్షిణఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.. దీంతో ఏపీకి వారం రోజుల పాటు వర్షసూచన చేసింది.. అంతేకాకుండా 4 రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఇవ్వాల్టి వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది.. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలతోపాటు.. పిడుగుపాటు హెచ్చరికలు చేసింది..

రాగల 3 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

వర్షాలతోపాటు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.. అలాగే.. చెట్ల కింద నిలబడవద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో కూడా వచ్చే మూడు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 1-2 గంటల్లో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే.. ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెంలో, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, యాదాద్రి – భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు