తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో ఒక్క రాత్రిలోనే ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ 2 మిలియన్స్ పెరిగారు. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ? విరాట్ కోహ్లీ లైక్ చేసిన పోస్ట్ ఏంటీ ? తెలుసుకుందామా.

ప్రస్తుతం ఐపీఎల్‏లో ఆర్సీబీ తరుపున ఆడుతున్న విరాట్ కోహ్లీ గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతుంది. ఇటీవలే అతడు తనకు తెలియకుండానే ఓ బాలీవుడ్ హీరోయిన్ పోస్టును లైక్ చేశాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్ షాకయ్యారు. ఏంటీ ఈ బ్యూటీ పోస్టుకు విరాట్ లైక్ చేశాడు అంటూ అవాక్కయ్యారు ఫ్యాన్స్. అసలు ఏం జరిగిందని తెలుసుకునేలోపే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే విరాట్ ఆమె ఫోటోకు పొరపాటున లైక్ చేశాడా.. ? లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే ఆలోచించేలోపే నెట్టింట ఈ విషయంపై పెద్ద చర్చే నడించింది. దీంతో ఆ లైక్ గురించి విరాట్ నేరుగా ప్రస్తావించాల్సి వచ్చింది. అసలేం జరిగింది.. ? ఇంతకీ విరాట్ లైక్ కొట్టిన హీరోయిన్ ఎవరు అనేది తెలుసుకుందామా.

బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ? అంటూ చిన్నప్పుడే టీవీల్లో ఫేమస్ అయ్యింది అవనీత్ కౌర్. చిన్న వయసులోనే బుల్లితెరపై పలు యాడ్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. హిందీలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది అవనీత్ కౌర్. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓఫోటోషూట్ కింద విరాట్ కోహ్లీ లైక్ కనిపించింది. బోల్డ్ ఫోటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ పోస్ట్ కింద విరాట్ లైక్ కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను నెట్టింట తెగ వైరల్ చేశారు. అంతేకాదు.. ఆ ఫోటోస్ కింద్ అనుష్క శర్మను సైతం ట్యాగ్ చేశారు. దీంతో చివరకు కోహ్లీనే రియాక్ట్ కావాల్సి వచ్చింది. తన ఫీడ్ క్లియర్ చేసేటప్పుడు అల్గారిథం పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని.. అంతేకాని దాని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని.. అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని అన్నారు కోహ్లీ. దీంతో ఈ వివాదానికి తెర పడింది.

కానీ విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది అవనీత్ కౌర్. ఇప్పుడు ఆమె పేరు క్రికెటర్స్, క్రీడా ప్రియులకు సైతం తెలిసిపోయింది. గత నాలుగు రోజుల్లోనే దాదాపు 2 మిలియన్ మంది ఫాలోవర్స్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో 3 కోట్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సెలబ్రిటీలు కూడా నాలుగు రోజుల్లో దాదాపు 2 మిలియన్ల మంది అనుచరుల మైలురాయిని చేరుకోలేదు. ఇది కోహ్లీ లాంటి ప్రభావం.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు