ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ – బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది..

ప్రయాణికులకు ఇండియన్ రైల్వే.. గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ – బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.. ఈ వందే భారత్ రైలు బెంగళూరు వెళ్లేవారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది.

మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి. విజయవాడ – బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20711) మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది.

బెంగళూరు నుంచి విజయవాడ.. తిరుగు ప్రయాణంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అదే రోజు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభమై… కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ రాత్రి 23.45 గంటలకు చేరుకోనుంది..

అయితే.. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి 3 రోజులు నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు మరింత వెసులుబాటు లభించనుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు