భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్‌. భారత్‌తో వాణిజ్య ఒప్పందం…

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్‌. భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదన్నారు ట్రంప్‌. ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే గరిష్ఠంగా 25 శాతం సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. 20 నుంచి 25 శాతం సుంకాలు విధించే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ తమపై భారీగా సుంకాలు విధించిందని ట్రంప్‌ ఆక్షేపించారు.

ఆగస్టు 1 సుంకాల విడుదల లిస్టులో యూరోపియన్‌ యూనియన్‌, మెక్సికో ఉన్నాయి. EU నుంచి కంపెనీలు కొట్టు కట్టేసి, అమెరికా బాట పట్టేలా వ్యూహం పన్నారు ప్రపంచపు పెద్దన్న. ఇక మన దేశంపై ట్రంప్‌ బాదుడు తగ్గించడానికి మనవాళ్లు చర్చల మంత్రం పఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా కామెంట్స్‌ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌, మెక్సికో ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని, ఆ దేశానికి రాసిన లేఖలో ట్రంప్‌ ప్రశంసించారు. యూరోపియన్‌ యూనియన్‌లో 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఈయూ నుంచి వాహన, ఔషధ, వైద్య కంపెనీలు అమెరికాకు తిరిగి వచ్చేలా, వాళ్లపై భారీగా టారిఫ్‌ వడ్డించారు ట్రంప్‌. పన్నుల భారం తట్టుకోలేక ఆయా కంపెనీలు అమెరికాలో తమ ఉత్పత్తులను తయారు చేస్తాయని ఈ ఎత్తుగడ పన్నారు ట్రంప్‌.

ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే దిగుమతులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదంటున్నారు ట్రంప్‌.

ఇక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అమెరికా, భారత్‌ చాలా నెలలుగా పనిచేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో పూర్తి స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మార్గం సుగమమవుతుందంటున్నారు. అయితే, పూర్తి స్థాయి ఒప్పందం ఎప్పుడు ఖరారవుతుందో క్లారిటీ లేదు. తాత్కాలిక ఒప్పందం ఖరారైతే, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల జాబితాలో ఇండియా చేరుతుంది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు