ఈపీఎఫ్‌వో).. ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టుల భర్తీకి గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నియామక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 230 పోస్టులను చేయనున్నట్లు అందులో తెలిపింది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్/ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 156, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టులు 74 వరకు..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో).. ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టుల భర్తీకి గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నియామక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 230 పోస్టులను చేయనున్నట్లు అందులో తెలిపింది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్/ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 156, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టులు 74 వరకు ఉన్నాయి. ఇక ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా అదే నెలలో 29వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్ట్ 18, 2025వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆగస్ట్ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కమిషన్ సూచించింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ముఖ్యంగా కంపెనీ లా, లేబర్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఎన్ఫోర్స్‌మెంట్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు 35 ఏళ్లకు మించకూడదు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల మేరకు ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల చొప్పున వయోసడలింపు ఉంటుంది.
ఒక పోస్టుకు అప్లై చేసేవారు రూ.25, రెండు పోస్టులకు దరఖాస్తు చేసేవారు రూ.50 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు తుది గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CRT), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు.