తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇక నుంచి స్వామివారి దర్శనం వేగంగా జరగనుంది. ఇందుకోసం ఏఐ ఆధారిత ఫేష్ రికగ్నేషన్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందుకు సహాయపడనుంది. వీటి వల్ల గత రెండు నెలలుగా స్వామివారి దర్శనం వేగంగా జరుగుతోంది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త అందించింది. స్వామివారి దర్శనం భక్తులకు వేగంగా జరిగేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అత్యాధునిక ఏఐ టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకునేందుకు సిద్దమవుతోంది. తిరుమలలో అన్నీ చోట్ల ఈ ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసి దర్శనం వేగంగా జరిగేలా చేయనున్నారు. ఏఐ టెక్నాలజీతో నడిచే ఈ ఫేష్ రికగ్నేషన్ సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అధికారులు ఎప్పటికప్పుడు వేగంగా అంచనా వేయవచ్చు. భక్తుల రద్దీ ఎక్కడ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల వేగంగా శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు.
వేగంగా స్వామివారి దర్శనం
ఆలయ పరిసర ప్రాంతాలు, మాడ వీధుల్లో ఈ ఏఐ ఆధారిత కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా భక్తుల కదలికలను తెలుసుకోనున్నారు. ఈ సీసీ కెమెరాలను వైకుంఠం క్యాకాంప్లెక్స్-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్కు అనుసంధానిస్తారు. దీంతో డ్యూటీలో ఉన్న అధికారులు నిరంతరం భక్తుల రద్దీ ఎలా ఉందనే విషయాలను గమనించవచ్చు. అలాగే భద్రత కోసం కూడా ఇవి ఉపయోగపడనున్నాయి. ఎక్కడైనా తొక్కిసలాట జరిగినా అధికారులకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత తిరుమలలో దర్శనాల వేగం బాగా పెరిగింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనాలు వేగంగా కల్పించారు. ఈ సెంటర్ ద్వారా భక్తుల అంచనాను ముందుగానే తెలుసుకోవడం వల్ల దర్శనాల వేగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
భక్తులకు భద్రత
ఈ ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో డిసెంబర్, జనవరిలో భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగింది. వేగంగా దర్శనాలు జరుగుతుండటంతో భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల రధసప్తమి సందర్భంగా కూడా మాధవీధుల్లో ఈ ఏఐ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవడం వల్ల భక్తులు గంటల పాటు దర్శనం కోసం క్యూలైన్లు, కాంప్లెక్సుల్లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ ఏఐ ఆధారిత కెమెరాల సహాయంతో వాహన సేవలను కూడా పర్యవేక్షించనున్నారు. వాహన సేవలను ఎంతమంది భక్తులు దర్శించుకుంటున్నారనే వివరాలు కూడా ఈజీగా తెలుసుకోనున్నారు.

