వర్షా కాలం వచ్చిందటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ హాస్పిటల్ బాట పట్టాల్సిందే. ఇందుకు ప్రధాన కారణం వర్షా కాలంలో తరచూ, జలుబు, దగ్గు వంటి వ్యాదుల బారిన పడడం. అయితే కొన్ని వీటిని జనాలు లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా లైట్ తీసుకోవడం వల్ల అవి క్రమంగా తీవ్రమైన సమస్యలుగా మారవచ్చు. ఇలాంటి జబ్బుల బారిన పడినప్పుడు వెంటనే అప్రమత్తమై సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే ఇలాంటి సమస్యల భారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం పదండి.
వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, జలుబు, దగ్గు వంటి వ్యాధులు రావడానికి సహకరిస్తుంది. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ, వర్షాల సమయంలో ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల కారణంగా.. జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సీజన్‌లో గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియా మరింత చురుగ్గా మారతాయి, ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారు వంటి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు దీనికి త్వరగా బలైపోతారు. అలాగే, వర్షంలో తడవడం, తడి బట్టలు వేసుకోవడం లేదా ACని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడే మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
సాధారణ జలుబు, జ్వరాన్ని తేలికగా తీసుకోవడ వల్ల కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుంది. మనం పదేపదే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్‌ల బారిన పడినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది, ఎలాంటి పని చేయాలనిపించదు. ఇది మన నిద్రపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జలుబు, జ్వరం తగ్గకుండా ఇలానే కొనసాగితే, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల, సకాలంలో చికిత్స మరియు జాగ్రత్త చాలా ముఖ్యం.
వర్షాకాలంలో జలుబు, దగ్గు మన దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలి!
వర్షాకాలంలో జలుబు, దగ్గు వేగంగా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్ కాబట్టి, వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం అని ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్ వైద్యుల ప్రకారం.. వర్షా కాలంలో జలుబు, దగ్గు బారిన పడకుండా ఉండాలంటే ఈ కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ముందుగా మనం వర్షంలో తడిసిపోకుండా చూసుకోవాలి, ఒకవేలా అనుకోకుండా వర్షంలో తడిచినా వెంటనే వెంటనే బట్టలు మార్చుకుని వేడి నీటితో స్నానం చేయండి. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తేలికపాటి వెచ్చని దుస్తులు ధరించండి. పసుపు పాలు, తులసి-అల్లం టీ లేదా కషాయం వంటి వేడి పానీయాలు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే తేలికపాటి, వేడి ఆహారాన్ని తినండి, చల్లని వస్తువులను తీసుకోవడం తగ్గించండి.
దానితో పాటు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, నిమ్మ, ఆమ్లా, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోండి. రోజుకు ఒకసారి ఆవిరి పట్టడం వల్ల, ముఖ్యంగా గొంతు నొప్పి ఉంటే, ఉపశమనం లభిస్తుంది. లక్షణాలు తీవ్రమైతే, వైద్యుడిని సంప్రదించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా తరచుగా చేతులు కడుక్కోండి.