థైరాయిడ్ సమస్యలను నియంత్రించాలంటే జీవన విధానంలో కొన్ని మార్పులు తప్పనిసరి. రోజు వారీ అలవాట్లను మెరుగు పరచడం ద్వారా థైరాయిడ్ పని తీరు ను బాగా పర్యవేక్షించవచ్చు. ప్రత్యేకించి ఆరోగ్యకరమైన డ్రింక్ లను త్రాగడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది.
శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన డ్రింక్ లను తగిన జాగ్రత్తలతో తీసుకుంటే హార్మోన్ల సమతుల్యతను నిలుపుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని సహజంగా ప్రోత్సహించే ఈ ప్రత్యేక డ్రింక్ లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మద్దతు అందిస్తాయి. ఇప్పుడు అలాంటి డ్రింక్ ల గురించి తెలుసుకుందాం.
పసుపు పాలు
పసుపులో ఉండే కర్కుమిన్ అనేది శరీరంలోని వాపును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. క్రిములను నిర్మూలించే శక్తి కూడా ఇందులో ఉంటుంది. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ వల్ల పసుపు శరీరానికి బాగా గ్రహించబడుతుంది. పసుపు, నల్ల మిరియాలు, పాలతో కలిసి తయారు చేసే పసుపు పాలు తాగడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
మజ్జిగ
మజ్జిగ అనేది ప్రోబయోటిక్స్ కు మంచి ఆధారం. ఇది గట్ మైక్రోబయోటాను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మంచి గట్ ఆరోగ్యం వలన శరీరంలో వాపు తగ్గుతుంది. ఇంట్లో తయారు చేసిన తాజా మజ్జిగను తీసుకోవడం శ్రేయస్కరం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రెడ్ జ్యూస్
బీట్‌రూట్, క్యారెట్ కలయికతో తయారు చేసిన రెడ్ కలర్ జ్యూస్ ఫైటోన్యూట్రియెంట్లను అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. తాజాగా తయారు చేసిన ఈ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఇది శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
గ్రీన్ జ్యూస్
ఆకుకూరలతో తయారు చేసే గ్రీన్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తాజా పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు తీసుకుని దోసకాయ రసం లేదా నిమ్మరసం కలిపి ఈ డ్రింక్ తయారు చేయాలి. ఆకుకూరలలో ఉండే క్లోరోఫిల్ శరీరానికి శుభ్రతను అందిస్తుంది. శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆల్కలీన్ లక్షణం కలిగి ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
దోసకాయ రసం
దోసకాయ రసం తరచుగా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దోసకాయ నీరు శరీరాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ ఆరోగ్యం మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
నిమ్మకాయ నీరు
నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీర సమతుల్యత మెరుగవుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. శరీరంలో ఉన్న విషాలను, అదనపు నీటిని బయటకు పంపించడంలో ఇది సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)