ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే మహిళలు… 40 ఏళ్లలోనూ సూపర్‌ ఫిట్‌గా ఉంటారు..!

ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే మహిళలు… 40 ఏళ్లలోనూ సూపర్‌ ఫిట్‌గా ఉంటారు..!

40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో వారు తాము తినే ఆహారం పట్ల మరింత ప్రత్యేక శ్రద్ధ పాటించాలి. నచ్చిన ఆహారమే కదా అని ఎది పడితే అది అతిగా తిన్నారంటే అనార్థలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మహిళలు ఆరోగ్యకరమైన, పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

మహిళలు ఎక్కువ స్ట్రెస్‌కు గురవుతారు. మరీ ముఖ్యంగా వివాహమైన మహిళలు సాధారణంగా ఇంటి పనుల్లో బీజీగా ఉంటారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పనితోనే సరిపోతుంది.. దీంతో వారు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తారు. డైటింగులు, వ్యాయామం వంటి వాటి పట్ల అశ్రద్ధగా ఉంటూ అనారోగ్యం కొని తెచ్చుకుంటారు. కానీ 40 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా వారి ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే 40ఏళ్లు పైబడిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తప్పక తెలుసుకోవాలని చెబుతున్నారు.

40 ఏళ్లు పైబడిన మహిళలు డైట్‌లో సూపర్‌ఫుడ్స్‌ చేర్చుకోవాలని చెబుతున్నారు. పేగు, గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. రెగ్యులర్‌ డైట్‌లో చియా విత్తనాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే, అప్పుడప్పుడు డార్క్‌ చాక్లెట్స్‌ తింటే కూడా కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు కూడా రెమిడీ

40ఏళ్లు పైబడిన మహిళలు తరచూ బీట్‌రూట్‌ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. దీంతో పాటు మీ ఆహారంలో అవిసె గింజలు చేర్చుకోవటం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో హార్మోన్‌ బ్యాలన్స్‌ కూడా అవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు