బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. అలాగే తాజా వెండి ధరలను చూడండి.

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,44,100కి చేరింది.. మరోవైపు, ఆల్ ఇండియా సరాఫా సంఘ్ ప్రకారం, మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,12,090కి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,34,100కి చేరుకుంది.

హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,940ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,02,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,940 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,02,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,44,100 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,12,090, 22 క్యారెట్ల ధర రూ.1,02,760 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,34,100 గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,11,940, 22 క్యారెట్ల ధర రూ.1,02,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,34,100 గా ఉంది.

చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,12,160 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,02,810 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,44,100 గా ఉంది.

కోల్‌కతా 24క్యారెట్ల బంగారం ధర రూ.1,11,940 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.10,2,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,34,100 గా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ వార్తలు