తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

ఏప్రిల్ 22 నుండి కర్రెగుట్ట కొండలలో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట పర్వతం ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.. అటువంటి పరిస్థితిలో, 20 వేలకు పైగా సైనికులు పర్వతంపై ఉన్న 2 వేలకు పైగా మావోయిస్టులను చుట్టుముట్టారు. ఇందులో హిడ్మా, దేవా వంటి మావోయిస్ట్ కీలక నేతలు కూడా ఉన్నారని సమాచారం.భారత్‌, పాక్‌ యుద్ధ నేపథ్యంలో యావత్‌ దేశం హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని ములుగు జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్‌, నక్సల్స్‌ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మే 7న ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. ఈ ఎన్ కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు..ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. తాజాగా మావోయిస్టులు పెట్టిన బాంబ్‌ దాడిలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలిసింది. పోలీసు కదలికలపై నిఘా పెట్టిన మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్టుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ పేల్చారు. దీంతో ముగ్గురు పోలీసులు చనిపోగా, మరో ముగ్గురు పోలీసులు గాయపడినట్టుగా తెలిసింది. దాడి జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా సరిహద్దుకు ఆనుకుని ఉందని తెలిసింది. పోలీసు బృందం సాధారణ కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఏప్రిల్ 22 నుండి కర్రెగుట్ట కొండలలో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట పర్వతం ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.. అటువంటి పరిస్థితిలో, 20 వేలకు పైగా సైనికులు పర్వతంపై ఉన్న 2 వేలకు పైగా మావోయిస్టులను చుట్టుముట్టారు. ఇందులో హిడ్మా, దేవా వంటి మావోయిస్ట్ కీలక నేతలు కూడా ఉన్నారని సమాచారం. ఈ ప్రాంతం మావోయిస్టులకు బలమైన కంచు కోటగా చెబుతారు. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మావోయిస్ట్‌ ఆపరేషన్ చేపట్టలేదు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు