ది గ్రాండ్ సీతా చరితం.. 4D టెక్నాలజీలో రామాయణం.. 513 మంది కళాకారులు ఒకే వేదికపై..

ది గ్రాండ్ సీతా చరితం.. 4D టెక్నాలజీలో రామాయణం.. 513 మంది కళాకారులు ఒకే వేదికపై..

ఈ కార్యక్రమం 13,27 మంది గ్రామీణ, గిరిజన విద్యార్థుల విద్యకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉచిత పాఠశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల చదువు కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో భారతదేశంలోని ఇతర నగరాలు, విదేశాలలో కూడా ప్రదర్శించబడుతుందని నిర్వాహకులు వెల్లడించారు.. సీతాదేవీ..

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లోని గ్రాండ్ థియేటర్‌లో జరిగిన గ్రాండ్ సీతా చరితం అనే ఆధ్యాత్మిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 4D టెక్నాలజీలో ప్రదర్శించబడిన ఈ ప్రత్యక్ష ప్రదర్శనలో 513 మంది కళాకారులు ఒకే వేదికపై 30 కి పైగా సాంప్రదాయ, ఆధునిక కళారూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించింది. ఈ నాటక ప్రదర్శనకు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శ్రీవిద్య వర్షస్వి దర్శకత్వం వహించారు. ఇది రామాయణంలోని కవిత్వం, ఆధ్యాత్మికతను కొత్త కోణంలో పరిచయం చేసింది. సాంప్రదాయ నృత్యాలు, జానపద కళలు, తోలుబొమ్మలాట, సంగీతం, డిజిటల్ సాంకేతికతలను మిళితం చేసిన ఈ ప్రదర్శనలో సీత ప్రేమ, త్యాగం, తెలివితేటలు, అంకితభావం వంటివి కళాకారుల హవభావాల ద్వారా అందంగా వ్యక్తీకరించారు.

ఈ నాటకం స్క్రిప్ట్ రామాయణానికి సంబంధించిన 20 కి పైగా వెర్షన్ల నుండి తీసుకోబడింది. ఇది శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్యాత్మిక జ్ఞానంతో మిళితం చేయబడింది. సంఘటనలను మాత్రమే కాకుండా వాటిలో ఉన్న అర్థాన్ని కూడా తెలియజేసే విధంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య విషయం ఏంటంటే.. ముంబైలోని ధారవిలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్కూల్ నుండి 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.. వారిలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనతో కళ, విద్య సమాజాలను ఎలా మార్చగలవో ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించాయి.

ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాడే, అనురాధ పౌడ్వాల్, అతా ఖాన్, తాలిబ్ తహిల్, పంకజ్ పెర్రీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మెస్సీ మాట్లాడుతూ, శ్రీ విద్య నటిగా, దర్శకురాలిగా అద్భుతమైన పని చేసిందని అన్నారు. ఇది కన్నుల పండుగ అంటూ కొనియాడారు.. ప్రముఖ నటి హీనా ఖాన్, మొత్తం ప్రదర్శన చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. ముఖ్యంగా పిల్లల పరిపూర్ణ ప్రదర్శన చూసి నేను ఆశ్చర్యపోయానంటూ ప్రశంసించారు.

గతంలో ఢిల్లీలో జరిగిన “ది కాస్మిక్ రిథమ్” వంటి 4,600 మంది కళాకారులతో కలిసి వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చిన శ్రీవిద్య, సీత జీవితంలోని అనేక క్షణాలను అనుభవ పూర్వకంగా, వాటిని నేటి ప్రేక్షకులు బాగా అర్థం చేసుకునే రూపంలోకి తీసుకురావడం నాకు వ్యక్తిగతంగా అద్భుతమైన అనుభవం అని అన్నారు.

ఈ కార్యక్రమం 13,27 మంది గ్రామీణ, గిరిజన విద్యార్థుల విద్యకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉచిత పాఠశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల చదువు కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో భారతదేశంలోని ఇతర నగరాలు, విదేశాలలో కూడా ప్రదర్శించబడుతుందని నిర్వాహకులు వెల్లడించారు.. సీతాదేవీ కథ ద్వారా ఆధ్యాత్మికత, జ్ఞానంతో నిండిన ఈ కళా ప్రదర్శన ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేయడం ఖాయంగా చెబుతున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు