అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ, కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ, తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్యోగ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. పలు పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ, కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ, తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత టెస్లా ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించడంతో ఇక ఇండియన్ మార్కెట్లోకి టెస్లా రాకకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే టెస్లా తొలుత తన కార్యకలాపాలను మొదట ముంబై, ఢిల్లీలో ప్రారంభించనుంది. టెస్లా తన లింక్డ్ఇన్ పేజీలో కస్టమర్ ఫేసింగ్ పోస్టులతో పాటు బ్యాక్ ఎండ్ పోస్టులకు సంబంధించి 13 పోస్టులు ప్రకటించింది. ఆ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
పోస్టులు
- ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్
- కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్
- కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్
- సేవా సలహాదారు
- ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
- సర్వీస్ మేనేజర్
- టెస్లా అడ్వైజర్
- విడిభాగాల సలహాదారు
- వ్యాపార కార్యకలాపాల విశ్లేషకుడు
- స్టోర్ మేనేజర్
- సర్వీస్ టెక్నీషియన్
అయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై అధిక దిగుమతి సుంకాలు ఉన్నందున టెస్లా ఇండియన్ మార్కెట్లోకి గతంలో ప్రవేశించలేదు. అయితే 40 వేల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైన కార్లపై ప్రైమరీ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుండి 70 శాతానికి తగ్గించడంతో భారత మార్కెట్లోకి టెస్లా రంగప్రవేశానికి సిద్ధమైంది. 2070 నాటికి జీరో డీ-కార్బనైజేషన్ సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సుంకాన్ని తగ్గించింది. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరగడంతో అన్ని కంపెనీలు ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టాయి. దేశీయ తయారీలో కనీసం రూ.41.5 బిలియన్లు(500 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టే తయారీదారులకు EVలపై దిగుమతి సుంకాలను తగ్గించింది భారత ప్రభుత్వం. ఇది కూడా టెస్లా ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఇండియాలో పెట్టుబడి, వ్యాపార కార్యకలాపాల కోసం టెస్లా అధినేత మస్క్ ఏప్రిల్ 2024 లో భారతదేశానికి రావాల్సి ఉంది. కానీ, టెస్లా కంపెనీలో అమెరికాలో ఉద్యోగుల తొలగింపులు, కార్ల రీకాల్‌ల కారణంగా మస్క్ పర్యటన వాయిదా పడింది.