ఇదే లాస్ట్‌ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

ఇదే లాస్ట్‌ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రస్తుతం అద్దె భవనాల్లో కార్యకాలాపాలు కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్శంగా అనేక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు అద్దె భవనాల్లో కార్యకాపాలు కొనసాగిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే వాటిని ఖాళీ చేయాలని సూచించారు. ఇందుకోసం ఆయన ఈరోజు వరకు డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నప్పటీ అద్దె భవనాల్లో ఆఫీస్‌లను ఏర్పాటు చేసి అద్దె చెల్లించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో ఉన్న ఆఫీస్‌లను ప్రభుత్వ భవనాల్లోకి మార్చడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ. 650 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు.

గత 12 సంవత్సరాలలో ప్రభుత్వ కార్యాలయాల అద్దెల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 7,800 కోట్లు ఖర్చు చేసిందని, దీని కారణంగా ప్రతి ఏడాది ప్రభుత్వం రూ. 650 కోట్ల భారం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడిన తర్వాత, శాశ్వత కార్యాలయ మౌలిక సదుపాయాలు త్వరితగతినా పూర్తి కాలేదని, దీనివల్ల హైదరాబాద్‌లోని అధిక అద్దె ప్రాంతాలతో సహా అనేక విభాగాలు అద్దె భవనాల అక్కడి నుంచే పనిచేయడం కొనసాగించాల్సి వచ్చిందన్నారు. కానీ ఇప్పూడు ప్రభుత్వ భవనాలు ఉన్నప్పటికీ.. ఇంకా ప్రభుత్వ ఆఫీస్‌లను అక్కడే కొనసాగించడం సరికాదన్నారు. వీటిపి ప్రభుత్వ కార్యాయాల్లోకి తరలించడం ద్వారా మిగిలే ఖర్చును ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు.

దీంతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆస్తుల సమగ్ర జాబితాను రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారుజ వీలైనంత త్వరగా మారుతున్న కార్యాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలని గుర్తించాలని సూచించారు. అయితే హైదరాబాద్‌లోని అనేక కార్యాలయ భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయించింది, కానీ 2019 నుండి అన్ని ఖాళీగానే ఉన్నాయని పేర్కొన్నారు.

అద్దె ఖర్చుల వల్ల ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఈ ఆస్తులను ఎందుకు సమర్థవంతంగా వాడుకోవట్లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. అద్దెలను నిరంతరం చెల్లించడం వల్ల ప్రజాధనం వృధా కాకుండా నివారించవచ్చని ఆయన నొక్కిచెప్పారు. తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు