రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ సర్కార్ సిద్ధం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్!

రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ సర్కార్ సిద్ధం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్!

రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బీపీఎల్ వర్గాలకు మూడు రంగుల కార్డులు, ఎపీఎల్ వర్గాలకు ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, త్వరలో వాటిని అందజేస్తామని తెలిపారు.

తెలంగాణ జనాభాలో 84 శాతం మంది సన్న బియ్యం పొందుతున్నారని పేర్కొన్న ఉత్తమ్, ఇది దేశంలోనే ఓ కీలక కార్యక్రమంగా నిలిచిందన్నారు. కేంద్రం మనిషికి నెలకు 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తోందని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.13 వేల కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చిన బియ్యం 80-90 శాతం పక్కదారి పట్టిందని, కానీ ప్రస్తుతం సరఫరా అవుతున్న సన్న బియ్యం వంద శాతం సద్వినియోగం అవుతోందని మంత్రి చెప్పారు. పేదలకు రూ.40 విలువ చేసే బియ్యం ఉచితంగా అందించడమంటే అది ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చూస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

వడ్ల సేకరణకు 8,209 కేంద్రాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 2,573 వడ్ల సేకరణ కేంద్రాలు తెరిచామని, మొత్తం 8,209 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తేమ శాతం 17 దాటిన ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీకి 30 లక్షల టన్నుల ధాన్యం సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.

రేషన్ కార్డ్ కొత్త దరఖాస్తుల వేగవంతం

ప్రస్తుతం రాష్ట్రంలో 2.81 కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతోందని మంత్రి తెలిపారు. కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తైతే ఈ సంఖ్య 3.10 కోట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేని కారణంగా హైదరాబాద్‌లో తాత్కాలికంగా పంపిణీ ఆపినట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు