మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళి.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. లైవ్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళి.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. లైవ్

మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయింది.. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సభ నివాళులు అర్పించింది.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం అయింది.. ఈ సందర్భంగా సభ్యులు మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలను గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని పోషించిన కీలక పాత్రను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ గుర్తుచేసుకునే అవకాశం ఉంది.

మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యుల సూచన మేరకు అవసరమైతే మరో చోటకు మారుస్తామన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కోరారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు