తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:-
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక:- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ/తూర్పు దిశ నుండి వీస్తున్నవి.. వీటి ప్రభావంతో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

