తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓదెల 2. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2.. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్‌ తేజ దర్శకత్వం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా అఘోరి పాత్రలో కనిపించనుంది. అలాగే హెబ్బా పటేల్, వశిష్ట సైతం ఈ చిత్రంలో కీలకపాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. మొన్నామధ్య ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ పడలేదు. ఈ మధ్య సినిమాలు శుక్రవారం కంటే ఒకరోజు ముందుగానే అంటే గురువారమే విడుదల చేస్తున్నారు. గురువారం రిలీజ్ అయితే బుధవారం రాత్రి అమెరికాలో ప్రీమియర్స్ వేయాల్సి వస్తుంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని తెలుపుతారు. ఆ టాక్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా పై పడుతుంది.

అయితే తమన్నా సినిమాకు మాత్రం ప్రీమియర్స్ వేయలేదు. డైరెక్ట్ గా తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్ వినిపించనుంది. మరి తమన్నా సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మునుపెన్నడూ చేయని డిఫరెంట్ పాత్రలో తమన్నా నటించనుండటంతో ఆమె అభిమానులు ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా తమన్నా తెలుగులో సూపర్ అందుకోలేదు. తెలుగులో ఆమె చివరిగా చేసిన భోళా శంకర్ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ సినిమా పై తమన్నా కూడా ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు