నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లి సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల బెడద పెరిగిందని, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

చిన్నపిల్లలను ఇంట్లో నుండి బయటకు పంపాలంటేనే గజ గజ వణికిపోతున్నారు తల్లితండ్రులు.. ఎటు వైపు నుండి కుక్కలు ఎప్పుడూ వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి..ముఖ్యంగా చిన్న పిల్లల పై దాడులు చేయడంతో వారు తీవ్ర గాయాల పాలవు తున్నారు..ఉమ్మడి జిల్లాలోని నర్సాపూర్,సిద్దిపేట, మెదక్ సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువయింది.

తాజాగా నర్సాపూర్లో 14వ వార్డులో ఆరు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు బాలుడు.. నర్సాపూర్ 14 వ వార్డ్ లో 6 సంవత్సరాల షేక్ అలీ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒకేసారి మూడు వీధి కుక్కలు ఆ బాలుడి పై దాడి చేశాయి..ఆ బాలుడి అరుపులు విన్న తల్లి షబానా ఇంట్లో నుండి హుటా హుటిన ఉరికి రావడంతో బాలుడి ప్రాణాలకు పెను ప్రమాదం తప్పింది..తల్లి కనుక సరైన సమయంలో స్పందించకపోతే బాలుడి ప్రాణాలు పోయేవి అంటున్నారు స్థానికులు..

తల్లి ఇంట్లో నుండి బయటకు వచ్చి కుక్కలను తరిమి కొట్టి వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు..బాలుడి కడుపు, కుడి చేతి కింది భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి.మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కుక్కల కోతుల బెడద తీవ్రమైందని ఆరోపిస్తున్నరూ స్థానికులు. వీధి కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నాం అని ఎన్నిసార్లు మున్సిపల్ సిబ్బందికి చెప్పిన లాభం లేకుండా పోయిందని అంటున్నారు స్థానికులు… అధికారులు ఇప్పటికైన స్పందించి వీధి కుక్కల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు