సగ్గు బియ్యం ప్రయోజనాలు తెలిస్తే.. ఎగబడి తింటారు..!

సగ్గు బియ్యం ప్రయోజనాలు తెలిస్తే.. ఎగబడి తింటారు..!

సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి. విటమిన్‌ K ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా వ్యాధిబారిన పడ్డవారు లేదంటే, వ్యాయామం చేసిన తరువాత తీసుకుంటే అద్భుత ఫలితాన్నిస్తుంది. సగ్గు బియ్యం నీటిని బాగా గ్రహిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.

సగ్గు బియ్యం, లేదా సబుదానా అనేది ఆరోగ్యకరమైన, అనేక ప్రయోజనాలు కలిగిన అతి ముఖ్యమైన ఆహార పదార్థం. ఇది చాలా రకాల వంటకాలలో ఉపయోగించవచ్చు. ఎలా తీసుకున్న కూడా ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలను అందిస్తుంది. అనేది అనేక భారతీయ వంటకాలలో ప్రధాన పదార్థం. ఇది తాటి చెట్టు నుండి తీసిన రసాన్ని పిండి చేసి తయారు చేస్తారు. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహారంలో సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సగ్గు బియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని పాలు, చక్కెర పోసి పాయ‌సంలా వండుకుని తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయ‌సం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.

సగ్గుబియ్యం తిసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది. ఊబ‌కాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలు స‌మ‌తాస్థితిలో ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమేగాక బరువు కూడా తగ్గుతారు.

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయట పడవచ్చు. అంతేకాదు, సగ్గు బియ్యం ఫైబర్‌కు మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్దకాన్ని నివారిస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలకు కూడా సగ్గు బియ్యంతో పరిష్కారం లభిస్తుంది.

విరేచనాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా సగ్గుబియ్యం దివ్యౌషధంగా పనిచేస్తుంది. విరేచనాల సమయంలో సగ్గు బియ్యం తీసుకుంటే తక్షణమే ఫలితం కనిపిస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి. విటమిన్‌ K ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా వ్యాధిబారిన పడ్డవారు లేదంటే, వ్యాయామం చేసిన తరువాత తీసుకుంటే అద్భుత ఫలితాన్నిస్తుంది. సగ్గు బియ్యం నీటిని బాగా గ్రహిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. సగ్గు బియ్యం గర్భిణీలకు, పిల్లలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఇతర ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. ఇది చర్మాన్ని మెరుగుపరచడానికి ముడతలు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు