గత ఏడాది రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా గతేడాదే ముగిసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు..
గత కొద్ది నెలలుగా ఇండియన్ రైల్వే వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గత ఏడాది రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా గతేడాదే ముగిసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు స్టేజ్ 1 ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ నెలలో ముగిశాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు రాత పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా విడుదల చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం.. ఆన్‌లైన్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష తేదీల్లో జరగనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 10 రోజులు ముందుగా సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను బోర్డు విడుదల చేస్తుంది. ఆ తర్వాత పరీక్షలకు 4 రోజులు ముందుగా అడ్మిట్ కార్డులను జారీ చేయనుంది. పరీక్ష రోజున ఆయా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల హాల్ టికెట్ ప్రింట్‌ఔట్‌తోపాటు ఒరిజినల్ ఆధార్ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లవల్సి ఉంటుంది.
కాగా అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయనుంది. మరోవైపు ఇటీవల పూర్తైన ఆర్‌ఆర్‌బీ గ్రాడ్యుయేట్ పోస్టులకు ప్రాథమిక ఆన్సర్ కీ కూడా తాజాగా విడుదలైంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది కీ రూపొందించి ఫలితాలను వెల్లడిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్టులకు కూడా ఆన్‌లైన్ రాత పరీక్షల అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.