మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు.. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు.. బీఆర్ఎస్‌ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ.. అంటూ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గొప్ప పేరు ఉన్న జనతా పార్టీ కనుమరుగు అయ్యింది.. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన అద్భుతమైన పార్టీ టీడీపీ.. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోంది.. దుర్మార్గాలు చేసిన BRS ఎలామనుగడ సాధిస్తుంది.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

నాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైలుకు పంపించారు. ఇయాల వాళ్ళే తన్నుకుంటున్నారు. ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు… ఎవరు అక్కర లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు… చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే… అంటూ రేవంత్ రె డ్డి పేర్కొన్నారు. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని.. ఈయన వెనకాల ఆయన ఉన్నాడని చెబుతున్నారని.. అదంతా అర్థరహితమంటూ.. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారన్న కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు