ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. అది ఏమిటంటే?

ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. అది ఏమిటంటే?

డార్లింగ్‌.. డార్లింగ్‌.. డార్లింగ్‌.. డార్లింగ్‌ పేరు లేకుండా వార్తలే ఉండవా? అంటే రోజూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ని విడిచిపెట్టి వార్తలేం చెప్పుకోవాలి? అన్నట్టుంది పరిస్థితి. ఇంతకీ నిన్న రాజాసాబ్‌ డీటైల్స్ తో ట్రెండ్‌ అయిన రెబల్‌ స్టార్‌ ఈ రోజు ఏ విషయంతో వైరల్‌ అవుతున్నారంటారా? చెప్పుకుందాం వచ్చేయండి..

బాహుబలి రెండు పార్టులను కలిపి సింగిల్‌ మూవీగా బాహుబలి ది ఎపిక్‌ అని తీసుకొస్తున్నారన్నది ఇప్పుడు వార్త. కానీ, ఆ సినిమా టైమ్‌లో రెండు పార్టులు, అన్నేసి సంవత్సరాలన్నది అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తించిన విషయం. రెండు పార్టుల మేనియాని జస్ట్ బాహుబలితోనే ఆపలేదు ప్రభాస్‌. సలార్‌లోనూ ఈ ఈక్వేషన్‌నే కంటిన్యూ చేశారు.

కాస్త ఒడుదొడుకుల్లో ఉన్న ప్రభాస్‌ కెరీర్‌ని గాడిలో పెట్టిన సినిమా సలార్‌. . ఈ సినిమాకు సెకండ్‌ పార్టుగా శౌర్యాంగపర్వంని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు ప్రశాంత్‌ నీల్‌

ఇటు రాజాసాబ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు డార్లింగ్‌. . రాజాసాబ్‌ ఫుటేజ్‌ ఆల్రెడీ నాలుగున్నర గంటలుంది. కచ్చితంగా సెకండ్‌ పార్టు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు ప్రొడ్యూసర్‌.

రాజాసాబ్‌ కంప్లీట్‌ కాగానే కల్కి సెకండ్‌ పార్టు కోసం ప్రిపేర్‌ కావాలి డార్లింగ్‌. సెకండ్‌ పార్టులో వారణాసి సెట్‌ బ్రహ్మాండంగా ఉంటుందనేది ఆల్రెడీ ఉన్న మాట.

కల్కి సంగతి సరే… ఫౌజీ సెకండ్ పార్టు ఉంటుందా? స్పిరిట్‌ కూడా రెండు భాగాల సినిమానేనా? అనే మాటలు కూడా ఆల్రెడీ మొదలయ్యాయి. ప్రభాస్‌ లాంటి స్టార్‌… సినిమాలో ఉంటే, జస్ట్ సింగిల్‌ ప్యాక్‌గా చుట్టేయడానికి ఇష్టపడట్లేదు మేకర్స్. ఎక్కడో లూస్‌ ఎండ్స్ వదిలేసి పార్ట్ 2కి పనికొచ్చేలాగానే ప్లాన్‌ చేసుకుంటున్నారు. సినిమా సక్సెస్‌ అయితే సీక్వెల్‌ గ్యారంటీ.. ఒకవేళ అటూ ఇటూ అయితే అంతటితో ఫుల్‌స్టాప్‌.. ఇదన్నమాట స్ట్రాటజీ!

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు