రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్.. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేసే ప్రక్రియను 5 రోజుల ముందు నుంచే అమలు చేయాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్.. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేసే ప్రక్రియను 5 రోజుల ముందు నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై నెల రేషన్‌ను 5 రోజులు ముందుగానే జూన్ 26 నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో గురువారం ఉదయం నుంచే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ అందించనున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందించడంలో కాస్త జాప్యం నెలకొనడంతో కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఈ నెలలో రేషన్ దుఖానాలకు రావడం అధికారులు గమనించారు. దీంతో వచ్చే నెలకు కాస్త ముందుగానే డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు, డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో వచ్చే నెల రేషన్ పంపిణీని … ఈ నెలాఖారు నుంచే ప్రారంభిస్తారు. నేటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు రేషన్ సరుకులను డీలర్లు వృద్దులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జులైలో ఇవ్వాల్సిన రేషన్‌ను జూన్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డు దారులకు సరుకుల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఐదు రోజులు ముందుగానే ప్రతినెల 26వ తేదీ నుంచి 30 తేదీ లోపు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందజేయనున్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు, కొండలపైన ఉన్న ప్రజలకు కూడా అంటే రేషన్ దుఖాణాలకు దూరంగా ఉన్న ప్రజలకు సరుకులు అందించే విషయంలో డీలర్లు చొరవచూపనున్నారు. అదనపు బాధ్యతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సహాయంతో కూటమి సర్కార్ డీలర్ల ఆదాయం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి రేషన్ షాపు బయట స్టాక్ బోర్డ్, ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌ను ఈ నెల నుంచి అందుబాటులో ఉంచనున్నారు.